Breaking News

లేబర్ కొడ్స్ వ్యతిరేకిస్తూ మే 20నజరిగే దేశవ్యాప్త సమ్మె జయప్రదం కోరుతూ…

-25న రాష్ట్ర సదస్సు
-కార్మిక సంఘాల పిలువు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్మిక వ్యతిరేక లేబర్ కొడ్స్ రద్దు చేయాలని మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.. ఈ మేరకు మంగళవారం బాలోత్సవ్ భవన్లో రాష్ట్ర స్థాయి కార్మిక సంఘాల నాయకుల సమావేశం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కొడ్స్ రూపొందించారని విమర్శించారు. కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులతో కనీసం ప్రతిపాదనగాని, చర్చించటం కానీ చేయలేదని మండిపడ్డారు. చట్టసభల్లో ప్రతి పక్షాలు వ్యతిరేకించినా ఏక పక్షంగా లోక సభ, రాజ్యసభ ల్లో ఆమోదించుకున్నారని అన్నారు. కార్మిక శాఖ అధికారులు, ఆ శాఖ రాష్ట్ర మంత్రుల చర్చలతో సరిపెట్టి ఆమోదించుకున్నారని, ఇది ఏ పాటి ప్రజాస్వామ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.మే 20 న జరిగే దేశవ్యాప్త సమ్మె జయప్రదం కోసం రాష్ట్ర సదస్సు ఏప్రిల్ 25న విజయవాడ యంబీవీకే ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని తెలిపారు .రాష్ట్ర సదస్సు అనంతరం రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని, మొత్తం ప్రజానికానికి సమ్మె అవసరాన్ని తెలియజేసి జయప్రదానికి కృషి చేస్తామని చెప్పారు.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్. రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే కార్మిక చట్టాల రద్దని, వాటి స్థానంలో లేబర్ కొడ్స్ అమలుకు పూనుకుంటున్నారని ధ్వజమెత్తారు. సుధీర్ఘకాలంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నా హక్కులు, చట్టాలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పి. గౌతంరెడ్డి మాట్లాడుతూ లేబర్ కోడ్స్ అమలు వలన కార్మికుల పనిగంటలు పెరుగుతాయని, ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కులు, సమ్మె చేసే హక్కులు కోల్పోతామని, లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మిక వర్గం బిజెపి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో సమరశీల పోరాటాలు చేసి, కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏ వి నాగేశ్వరావు, ఏఐటీయూసీ డిప్యూటీ కార్యదర్శి వెంకటసుబ్బయ్య,ఏఐటియుసీ రాష్ట్ర నాయకులు జే.రాధాకృష్ణమూర్తి,ఏఐఎఎఫ్ టియు(న్యూ) రాష్ట్ర కార్యదర్శి జాస్తి కిషోర్ బాబు, ఏఐయుటియుసి రాష్ట్ర అధ్యక్షులు సుధీర్, ఐఎఫ్ టియు రాష్ట్ర అధ్యక్షులు యం. రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఎన్ వి కృష్ణా, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై. కేశవరావు, సిఐటియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ సిహెచ్ శ్రీనివాస్, ఏ. వెంకటేశ్వర రావు,సిఐటియు విజయవాడ సెంట్రల్ సిటీ అధ్యక్షుడు కే.దుర్గారావు,ఏఐఎఫ్ టియు(న్యూ) జిల్లా నాయకులు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *