Breaking News

అభివృద్ధి పనులకు అధికారులు పర్యవేక్షణ చేయాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులకు టెండర్ పొందిన కాంట్రాక్టర్లు తప్పనిరిగా నిర్దేశిత గడువు మేరకు పనులు పూర్తీ చేసేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ గారు కొరెటేపాడు, పెద్దపలకలూరు రోడ్, ఉద్యోగ నగర్, జేకేసి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను తనిఖీ చేసి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో టెండర్ అగ్రిమెంట్ లోని గడువు మేరకు కాంట్రాక్టర్లు పనులు పూర్తీ చేయాలని, పనుల జాప్యం వలన స్థానిక ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. పనులు జరిగే సమయంలోనే నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఏఈలు, ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలన్నారు. నాణ్యతపై ఫిర్యాదులు వస్తే సంబందిత ఇంజినీరింగ్ అధికారులే భాధ్యత వహించాలని స్పష్టం చేశారు. సిసి రోడ్ల ఏర్పాటుకు ముందే తప్పనిసరిగా డ్రైన్ నిర్మాణం చేయాలన్నారు. సచివాలయాల వారీగా ఎమినిటి కార్యదర్శులు త్రాగునీటి సరఫరా సమయాల్లో శ్యాంపిల్స్ సేకరించాలని, కలుషిత నీటి సరఫరా గుర్తిస్తే తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పర్యటనలో డిఈఈలు రమేష్ బాబు, శ్రీనివాస్, ఎస్ఎస్ సోమశేఖర్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *