Breaking News

మోడీ పర్యటన నేపథ్యంలో మంత్రి గొట్టిపాటికి కీలక బాధ్యతలు

-మంగళగిరి మీదగా వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్ల బాధ్యతను మంత్రి గొట్టిపాటికి అప్పగింత
-మంగళగిరి పార్టీ ఆఫీసులో కూటమి నాయకులతో మంత్రి గొట్టిపాటి సమావేశం

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై బిజెపి, జనసేన నాయకులతో కలిసి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గం మీదగా సభకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ను తెలుగుదేశం అధిష్టానం మంత్రి గొట్టపాటి రవికుమార్ కు అప్పగించింది. ఈ నేపథ్యంలో కూటమి నాయకులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు జనసేన, బీజేపీ నాయకులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి.. నినాదంతో ప్రతీ కుటుంబం నుంచి ఒకరు మోదీ సభకు వచ్చేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లు పడిన కష్టాన్ని ప్రజలు గుర్తు చేసుకని కసిగా అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి తరలి రావాలని మంత్రి గొట్టిపాటి కోరారు. ఒక్క అవకాశం అంటూ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. సీనియర్ ఎన్టీఆర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ స్థాయికి చేర్చితే… జగన్మోహన్ రెడ్డి తన తుగ్లక్ చర్యలతో తెలుగువారి పరువును ప్రపంచ స్థాయిలో తీశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచం నచ్చే రాజధానిగా అమరావతిని నిలిపేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ఎన్నో ఆర్థిక సంక్షోభాలు ఉన్నా సరే వాటిని అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా సమపాళ్లలో ముందుకు తీసుకు వెళ్తున్న నాయకత్వదక్షత కేవలం చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వైయస్ జగన్ హయాంలో స్కీముల పేరుతో పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని పోయి స్కాంలుగా మిగిలాయని ఎద్దేవా చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *