Breaking News

నటరాజకు నాట్య వినోదం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాట్యచార్యుడు డాక్టర్ చింతారవి బాల కృష్ణ నృత్య శిక్షణలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించే కూచిపూడి నృత్య రంగ ప్రవేశం ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు కార్యక్రమంలో వల్లభజోస్యుల శ్రీదత్త ప్రదర్శించిన అంశాలు నేత్ర పర్వంగా సాగాయి. నర్తనగణపతి, చిందబరీశ్వర స్తవమ్, పదము, నగుమోము, ధిల్లానా అంశాలను ప్రదర్శించారు. నృత్య సంప్రదాయాన్ని పాటించి లైవ్ కార్యక్రమంగా సాగిన కార్యక్రమంలో నట్టువాంగం డాక్టర్ చింతారవి బాల కృష్ణ, గాత్రం సీహెచ్ శ్రీనివాస్, మృదంగం పసుమర్తి హరినాధ్, వయోలిన్ పాలపర్తి ఆంజనేయులు, వేణువు కుమార్ బాబు సహకరించారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వల్లభజోస్యుల పవన్, శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు డాక్టర్ చింతారవి బాలకృష్ణకు గురు సత్కారం నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *