Breaking News

త్వరలో నీకూ ‘గాలి’ గతే…

-జగన్ పై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఫైర్
-బీసీల అభ్యున్నతే లక్ష్యంగా చంద్రబాబు పాలన
-గతంలో ఎన్నడూ లేనంతగా నిధులు కేటాయింపు
-అసూయతో రగిలిపోతున్న జగన్
-తప్పుడు ప్రచారాలతో కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న వైసీపీ నాయకుడు
-కుట్టు శిక్షణ స్కీమ్ లో ఎటువంటి స్కామూ లేదు… : మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడని, కళ్లల్లో నిప్పులు పోసుకుంటూ రాష్ట్రంపైనా, కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. జగన్ పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయని, త్వరలోనే గాలి జనార్ధన్ రెడ్డి గతే పడుతుందని అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రారంభించిన కుట్టు శిక్షణ కార్యక్రమంపై తన పత్రికలో జగన్ తప్పుడు రాస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రజామోదం పొందిన కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం మానుకోకుంటే, ప్రజల ఛీత్కారానికి గురై ఉన్న 11 సీట్లు కూడా రావాని అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ, సామాజిక గుర్తింపుతో పాటు ఆర్థికాభివృద్ధి కల్పించడమే లక్ష్యంగా టీడీపీ ఆవిర్భవించిందన్నారు. అన్న ఎన్టీఆర్ నుంచి నేటి సీఎం చంద్రబాబు వరకు బీసీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. మహిళలను ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. లక్షా రెండు వేల మందికి పైగా మహిళలకు కుట్టు మిషన్ ఉచితంగా అందజేసి, నిష్ణాతులతో 360 గంటల పాటు ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మూడు లక్షలకు పైగా మహిళలు ఉచిత కుట్టు శిక్షణకు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో అర్హులైన లక్షా 2 వేల మందిని లబ్ధిదారులు ఎంపిక చేశామని తెలిపారు. మహిళలకు మంచి చేయడాన్ని జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా 720 శిక్షణా కేంద్రాల్లో మహిళలకు టైలరింగ్ లో శిక్షణ అందజేస్తున్నామన్నారు.

అభివృద్ధిని చూసి విషం చిమ్ముతున్నాడు…
కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలన్నీ విజయ రాజకీయంగా వంతమైతే, మహిళలంతా సీఎం చంద్రబాబుకు, టీడీపీకి అండగా ఉంటే రాజకీయంగా తాను సమాధి కావడం ఖాయమని భావించిన జగన్ రెడ్డి తప్పుడు ప్రచారానికి తెరతీశాడని మంత్రి సవిత మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అసూయతో కూటమి ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పథకాలపైనా తన పత్రికలో తప్పుడు రాతలు రాయచి విషం చిమ్ముతున్నాడన్నారు. తన 5 ఏళ్ల పాలనలో మహిళలను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, యువతను ఇలా అన్ని వర్గాల వారిని జగన్ మోసగించాడన్నారు. శవాలు చూస్తే నవ్వుతాడని, అభివృద్ధిని చూస్తే ఏడుస్తున్నాడంటూ జగన్ తీరును మంత్రి సవిత ఎండగట్టారు. మహిళలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మా ప్రభుత్వం మంచి చేస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నాడన్నారు. కుట్టు శిక్షణ స్కీమ్ లో ఎటువంటి స్కామ్ చోటుచేసుకోలేదని, పాదర్శకంగా టెండర్లు ఖరారు చేశామని మంత్రి స్పష్టం చేశారు. మహిళలకు కుట్టు శిక్షణా పథకంపై జగన్ గాని, మాజీ మంత్రులుగా చర్చకు రావాలని మంత్రి సవిత సవాల్ విసిరారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు… స్కామ్ లు చేసిన జగన్ రెడ్డికి అన్నీ స్కామ్ లుగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

త్వరలో నీకూ ‘గాలి’ గతే…
జగన్ మీద ఇప్పటికే 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులున్నాయని మంత్రి సవిత తెలిపారు. రూ.43 వేల కోట్ల అక్రమాస్తులను జగన్‌ పోగేశారని దర్యాప్తు సంస్థలే నిగ్గుతేల్చాయన్నారు. గూగుల్ లో ఖైదీ నెం. 6093 కొడితే జగన్ అవినీతి చిట్టా బయయపడుతుందన్నారు. అధికారంలోకి రాకముందే ఈ అవినీతి సామ్రాట్ చేతివాటం చూపాడని, అధికారంలోకి వచ్చిన అవినీతిలో ఇంటర్నేషనల్ చేరారని విమర్శించారు. జగన్ అవినీతిపరుడని సీబీఐ, ఈడీలే కాదు… స్వయంగా ఆయన చెల్లి షర్మిల కూడా ఇదే మాట చెబుతోందన్నారు. మద్యం స్కామ్ లో వేల కోట్లు నొక్కేశారన్నారు. రేపో మాపో జగన్ పాపం కూడా పండడం ఖాయమని, గాలి జనార్ధన్ రెడ్డి గతే పట్టడం తథ్యమని మంత్రి తెలిపారు. అవినీతి ఊబిలో కూరుకుపోయన జగన్ రెడ్డికి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజామోదం పొందిన కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు మానుకోకుంటే, ఇప్పుడున్న 11 సీట్లు కూడా రానున్న ఎన్నికల్లో రావని మంత్రి సవిత స్పష్టంచేశారు.

11 నెలల్లో బీసీల అభివృద్ధికి భారీగా నిధుల కేటాయింపు
11 నెలల కాలంలోనే బీసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలుచేసిందని, మరికొన్ని పథకాలు అమలు చేయనుందని మంత్రి సవిత తెలిపారు. బీసీల వృద్ధి కోసం ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత కేటాయింపులు చేశామన్నారు. 2024-25 బడ్జెట్ లో 39,007 కోట్లు, 2025-26లో 48 వేల కోట్లు కేటాయించామన్నారు. స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందజేస్తున్నామన్నారు. బీసీ హాస్టళ్ల అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు కేటాయించామన్నారు. బీసీలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం పెంచేలా సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకున్నారన్నారు. చట్టసభలలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేశామన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుతో పాటు స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ, సివిల్ సర్వీసెస్ శిక్షణ అందజేస్తున్నామన్నారు. బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు అండగా నిలుస్తున్నామన్నారు. ఇలా అన్ని విధాలా బీసీలను అభివృద్ధి పథంలోకి తీసుకురాడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ, మహిళల ఉచిత కుట్టు శిక్షణకు తీసుకున్న చర్యలను వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *