Breaking News

విజయవాడ క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటాలని, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో రాణించిన క్రీడాకారిణి ‘చైత్రదీపిక’ ను అభినందించి మరిన్ని పతకాలు సాధించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్టిస్టిక్ పోటీల్లో ఎన్నో పతకాలను సాధించిన ‘చైత్రదీపిక’ ను విజయవాడ మునిసిపల్ కమీషనర్ ధ్యానచంద్ర హెచ్. ఎం సొమవారం ఉదయం ప్రధాన కార్యాలయం లో అభినందించారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎన్ఎస్ఎం స్కూల్లో 10వ తరగతి చదువుతున్న చైత్ర ఇటీవల తైవాన్ లో జరిగిన తైవాన్ ఆర్టిస్టిక్ రోలరు స్కేటింగ్ ఓపెన్ కాపిటిషన్స్ లో చైత్రదీపిక భారత జట్టు కు పలు విభాగాలులో ప్రాతినిత్యం వహించి, పెయిర్ స్కేటింగ్ విబాగం లో బంగారు పతకం, Inline విబాగం లో కాంస్య పతకం, Couple డాన్స్ విబాగం లో రజత పతకాలు సాధించి, భారతదేశం తరుపున స్కేటింగ్ లో ఆరు దేశాలకు (ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, జపాన్, కొరియా, ఇటలీ, సింగపూర్) దీటైన పోటీ యిచ్చి మూడు పతకాలు సాధించి దేశానికి ఏంతో పేరు తీసుకొంచింది. గతంలో చైనా లో జరిగిన 19th ఆసియన్ రోలరు స్కేటింగ్ ఛాంపియన్షిప్ (వరల్డ్ స్కేటింగ్ అసోసియేషన్) లో కూడా భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించి పెయిర్ స్కేటింగ్ లో బంగారు పతకం సాధించి దేశానికి ఏంతో పేరు తీసుకొంచింది. దక్షిణ కొరియా లో జులై 20 నుంచి ౩౦వ తేదీ వరకు జరిగే 20వ ఏషియన్ రోలరు స్కేటింగ్ ఛాంపియన్షిప్ నకు చైత్రదీపిక ఎంపికైనందుకు విజయవాడ మునిసిపల్ కమీషనర్ ధ్యానచంద్ర గారు చైత్రదీపిక ను అభినందించి దేశానికి భవిషత్ లో మరిఎన్నో పతకాలు సాధించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *