తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలు సోమవారం మధ్యాహ్నం తర్వాత ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 770 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 23 జనరల్, 11 ఒకేషనల్ కేంద్రాల్లో మధ్యాహ్నం 02.30 నుంచి సాయంత్రం 05.30 గంటల వరకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు జరిగింది. ఈ పరీక్షకు జనరల్ 802 మంది, ఒకేషనల్లో 46 మంది మొత్తం 848 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా జనరల్లో 74, ఒకేషనల్లో 4 మంది, మొత్తం 78 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో త్రాగు నీటి వసతి, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షణ, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా బస్సుల సౌకర్యం కల్పించామని ఆర్.ఐ. ఓ ఆ ప్రకటనలో తెలిపారు.
Tags tirupathi
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News