విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టైపురైటింగ్ మరియు షార్ట్ హ్యాండ్ పరీక్షల తేదీలను ప్రకటించినట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ బోర్డు కార్యదర్శి జి.వి.రామచంద్ర రావు, సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. షార్ట్ హ్యాండ్ పరీక్షను ఈ ఏడాది జూలై 12 మరియు 13వ తేదిలలో, టైప్ రైటింగ్ పరీక్షను, ఈ ఏడాది జూలై 19 మరియు 20 వ తేదిలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను మే నెల చివరి వారంలో జారిచేయనున్నట్లు ఆయన చెప్పారు. పూర్తి వివరాలు మరియు పరిక్షలకు సంబంధించిన తాజా సమాచారం కొరకు అభ్యర్ధులు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ బోర్డు, మంగళగిరి, అధికారిక వెబ్ సైట్
http://apsbtet.ap.gov.in/#!/index/HomeNotifications. ను సందర్శించాలని జి.వి.రామచంద్ర రావు కోరారు.
Tags vijayawada
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News