Breaking News

రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ది చెందే విధంగా ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తోంది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-నోవోటెల్ లో క్రెడాయ్ క్రౌనింగ్ ది టార్చ్ బేర‌ర్ 2025-2027 కార్య‌క్ర‌మం
-ముఖ్యఅతిథులు గా పాల్గొన్న మంత్రులు నారాయ‌ణ‌, కొల్లు రవీంద్ర‌, ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గ‌ద్దె రామ్మోహ‌న్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్ర‌తినియోజ‌క‌వ‌ర్గం పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. గురునాన‌క్ కాల‌నీలోని నోవాటెల్ హోట‌ల్ లో మంగళ‌వారం జ‌రిగిన క్రెడాయ్ క్రౌనింగ్ ది టార్చ్ బేర‌ర్ 2025-2027 కార్య‌క్ర‌మానికి ఎంపి కేశినేని శివ‌నాథ్, మంత్రులు నారాయ‌ణ‌, కొల్లు ర‌వీంద్ర‌, ఎమ్మెల్యేలు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ అమ‌రావ‌తి ప్ర‌జ‌ల క‌ల‌ల రాజ‌ధాని, దేశంలోనే చ‌క్క‌టి వెల్ ప్లాన్ క్యాపిట‌ల్ గా అమ‌రావ‌తి వుండ‌నుంద‌న్నారు.అభివృద్ది విజ‌య‌వాడ , అమ‌రావ‌తి లోనే కాదు, విశాఖ‌ప‌ట్ట‌ణం, తిరుప‌తి, రాజ‌మండ్రి, అనంత‌పురం లో కూడా అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక సిద్దం చేస్తుంద‌న్నారు. విశాఖ ప‌ట్ట‌ణంలో సాప్ట్ వేర్ ఇండ‌స్ట్రీ తో పాటు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ రానున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ఒక ప‌రిశ్ర‌మ తీసుకువ‌చ్చి రాష్ట్రాభివృద్ది చేసేందుకు సీఎం చంద్ర‌బాబు కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. అవ‌కాశాలు వ‌స్తున్నాయి..ఆ .అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు. త్వ‌ర‌లో నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక ఇండ‌స్ట్రీ హ‌బ్ రానుంద‌న్నారు.ఇక బంద‌ర్ లో ఢిపెన్స్ ఇండ‌స్ట్రీతో పాటు బంద‌ర్ పోర్ట్ కూడా రానున్న‌ట్లు చెప్పారు. ప్ర‌పంచంలో ఒక‌టి రెండు దేశాల్లో వున్న క్వాంట‌మ్ కంప్యూటింగ్ సిటీ కూడా అమ‌రావ‌తి రాబోతుంద‌ని తెలిపారు. నిర్మాణ రంగంలో కార్మికుల‌కు, బిల్డ‌ర్స్ కి ఉప‌యోగ‌ప‌డే విధంగా సిల్క్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్ విజ‌య‌వాడ లో ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఇక మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయ‌ణ స‌మ‌స్యలు ఎక్క‌డ వున్నాయో తెలుసుకుని దాన్ని ప‌రిష్క‌రించ‌టంలోచాలా క‌ష్ట‌ప‌డ‌తారని కొనియాడారు.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏ విధంగా క‌ష్ట‌ప‌డ‌తారో అదే విధంగా మంత్రి నారాయ‌ణ క‌ష్ట‌ప‌డ‌తార‌ని తెలిపారు. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో రాత్రి ప‌గ‌లు అనే తేడా లేకుండా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు కృషి చేశార‌న్నారు. ప‌లు రాష్ట్రాల్లో అమ‌ల్లో వున్న పాల‌సీల‌ను అధ్య‌యనం చేసి రాష్ట్రంలో బిల్డ‌ర్స్ కి బెస్ట్ పాల‌సీ తీసుకువ‌చ్చార‌న్నారు. అమ‌రావ‌తి రీస్టార్ట్ ప్రోగ్రామ్ మంత్రి నారాయ‌ణ చేతుల మీద‌గానే జ‌రిగింద‌న్నారు. సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌కు మంత్రి నారాయ‌ణ ప‌నిచేస్తారని కొనియాడారు. రాష్ట్ర ప్ర‌భుత్వం వ్యాపార‌స్తుల‌కు , ప‌రిశ్రామికవేత్త‌ల‌కు, బిల్డ‌ర్స్ కు అండ‌గా వుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో క్రెడాయ్ నేష‌న‌ల్ ప్రెసిడెంట్ జి.రామిరెడ్డి, క్రెడాయ్ ఎపి ప్రెసిడెంట్ బాయ‌న శ్రీనివాస‌రావు, క్రెడాయ్ ఎపి జ‌న‌ర‌ల్ సెక్ర‌టరీ దాస‌రి రాంబాబుల తో పాటు క్రెడాయ్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *