Breaking News

తెలుగుదేశం పార్టీ ఒక స్వచ్చంద సేవాసంస్థ

-గద్దె క్రాంతి కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగానే కాకుండా ఒక స్వచ్చంధ సేవా సంస్థలా పనిచేస్తుందని తెదేపా యువ నాయకుడు గద్దె క్రాంతికుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం 16వ డివిజన్ భూపేష్ గుప్తా నగర్లో గద్దె క్రాంతికుమార్ పర్యటించారు. భూపేష్ గుప్తా నగర్ కు చెందిన చక్కా శివాజీ ఇటీవల చనిపోగా వారి కుటుంబ సభ్యులను గద్దె క్రాంతి కుమార్ పరామర్శించి, శివాజీ భార్య చక్కా మణికి రూ.12 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా ఒక స్వచ్చంధ సేవాసంస్థలా పనిచేస్తుందన్నారు. దానిలో భాగంగానే ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్, బసవ తారకం క్యాన్సర్ హాస్పటల్, ఎన్టీఆర్ ట్రస్టు పేరుతో పేదలకు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. దానిని స్ఫూర్తిగా తీసుకుని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ గత 30 సంవత్సరాల నుంచి పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. దానిలో భాగంగా చక్కా శివాజీ గుండెపోటుతో మరణించగా ఆకుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో తమ సొంత నిధులు రూ.12 వేలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ తెదేపా అధ్యక్షులు రత్నం రమేష్, జనసేన అధ్యక్షులు చందు శివరామకృష్ణ, ఉప్పుశెట్టి లీలా వెంకటరావు, కోడాలి సోమేశ్వరరావు, చక్కా రామయ్య తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *