-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షపు నీరు రోడ్డుపైన నిలువ ఉండకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బెంజ్ సర్కిల్, డివి మేనర్ రోడ్, జమ్మిచెట్టు సెంటర్, రమేష్ హాస్పిటల్ రోడ్, నిర్మలా కాన్వెంట్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఒక ప్రాంతంలో డీసిల్టింగ్ చేసినప్పుడు కేవలం సైడ్ డ్రైన్లో నే కాకుండా కలవట్లలో కూడా డీసిల్టింగ్ చేసి పూర్తి స్థాయిలో ఎటువంటి వ్యర్ధాలు పూడికలు కాలువలో లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ సిబ్బంది క్షేత్రస్థాయి నుండి పై స్థాయి వరకు సమన్వయంతో పని చేయాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉత్తమ విధానాలతో సమస్యలను అధిగమించాలని, అందులో భాగంగా చీఫ్ ఇంజనీర్ ప్రతిరోజు క్షేత్రస్థాయి సిబ్బంది నుండి సమస్యలు సేకరించి, నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఇన్చార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, జాయిన్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి వెంకట సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సిటీ ప్లానర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News