Breaking News

పేదలకు అందించే ఇళ్లను త్వరితగతిన నిర్మించండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు అందించే ఇళ్లను త్వరితగతిన నిర్మించాలని, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఎం శివప్రసాద్ , కాంట్రాక్టర్లు, లబ్ధిదారులు, హౌసింగ్, విఎంసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మరియు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండిఎం శివప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్టర్లు అందరూ సహకరించాలని త్వరితగతిన ఇళ్లన్నీ పూర్తి చేయాలని అన్నారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్యలో ఉన్న సమన్వయ లోపం లో ఉన్న సమస్యలను ముఖాముఖి చర్చించడంతో సమస్యలను పరిష్కరిస్తూ, ప్రభుత్వం తరఫునుండి వారికి సంపూర్ణ సహాయం అందుతుందని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు. కాంట్రాక్టర్లకు కేటాయించిన ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి గడువులోపు అందించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి సూపరిండెంటింగ్ ఇంజనీర్ వర్క్స్ పి సత్యనారాయణ ప్రాజెక్ట్ ఆఫీసర్ యు సి డి విభాగం పి వెంకట నారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, హౌసింగ్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ వేణుగోపాల్, పిడి లీలారాణి, హౌసింగ్ సిబ్బంది, విఎంసి సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *