Breaking News

అప్పు చేసిన పాపానికి నా తొమ్మిదేళ్ల కుమార్ని బలి తీసుకున్న దుండగులు… : అంకమ్మ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నా భర్త చేసిన అప్పు తీర్చమని కొడుకుని తాకట్టు పెట్టుకుని ఆపై క్రూరంగా హత్య చేసారని కన్నీటి పర్యాంతమైంది తల్లి. హత్యకు గురైన బాలుడి తల్లి అంకమ్మ. కేవలం 15 వేలు అప్పు చేసిన నేరానికి కుటుంభంతో సహా వెట్టి చాకిరీ చేయించుకొని చివరకు 9 ఏళ్ల బిడ్డను హత్య చేసిన దుండగుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెట్టి విమోచన వేదిక సంఘం సభ్యులతో కలసి మాట్లాడుతూ పది రోజులు గడువులో తెచ్చి ఇస్తానని చెప్పిన వినకుండా వెంకటేశ్వర్లు అనే నా కొడుకు ను తన వద్దే గ్యారంటీ కోసం అట్టిపెట్టుకొని వడ్డీతో కలిసి రూ.45,000 ఇవ్వాలని ముత్తు అనే అతను డిమాండ్ చేశాడన్నారు. ఏప్రిల్ చివరి వారంలో బకాయి మొత్తం సొమ్ము సమకూర్చుకుని ఇవ్వటానికి వెళితే అక్కడ ముత్తు మీ అబ్బాయి ఎక్కడో ఉన్నా డని, ఆ తర్వాత ఆసుప త్రిలో ఉన్నాడని, ఆ తర్వాత పారిపోయాడని ఏదో సాకు లు చెబుతూ వచ్చాడని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న వెంకటేశ్వర్లు తల్లి అంకమ్మ. ఎంతకు చూపించక పోవటంతో పోలీసులను ఆశ్రయించటంతో పచ్చకామర్లతో చనిపోయాడని నా కొడుకు వెంకటేశ్వర్లు మృత దేహాన్ని మట్టిలో పాతేసిన ప్రాంతాన్ని చూపించిన ముత్తు. వెట్టి విమోచన వేదిక కన్వీనర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ తమిళనాడు లోని కాంచీపురంలో తొలుత పిల్లవాడు పారిపోయాడ ని బుకాయించడం, గిరిజన మహిళ తన కులానికే చెందిన కొందరితో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింద న్నారు. గిరిజన యానాది తెగకు చెందిన అంకమ్మ, అతని భర్త చెంచయ్య, ముగ్గురు కుమారులు తిరుపతిలో బాతుల పెంపకందారు వద్ద ఏడాది పాటు పనిచేశారన్నారు. ఆ తర్వాత చెంచయ్య మరణించడంతో అతను తనకు రూ.15,000 బాకీ పడ్డాడంటూ అంకమ్మ, ముగ్గురు కుమారులను తన వద్దే చాకిరీ చేయించుకుంటూ వచ్చాడన్నారు.  స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడుస్తున్నా, అనేక చట్టాలు గిరిజనులు ఉన్న నేటికీ ఏదో ఓ మూల వెట్టి చాకిరికి బలి ఆతున్నరన్నారు. బాలున్ని కిరతకంగా హత్య చేసిన నిందితుడిపై వెట్టిచాకిరీ నిరోధక చట్టంపై, బాలకార్మక చట్టం, జ్యువనైల్ జస్టిస్ చట్టం, ఎస్సీ, ఎస్టీ అకృత్యా ల చట్టం, భారతీయ న్యాయ సంహిత లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తేన్మోయి, జీవన్‌ జ్వాల నాయకురాలు, వెంకటపతి, రాష్ట్ర అధ్యక్షుడు, యానాది సంఘం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *