Breaking News

‘మహానాడు’లో చేనేత సొబగులు

-చేనేత వస్త్రాలు కొనుగోలు చేసిన మంత్రి సవిత

కడప, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేతల అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధిని టీడీపీ మరోసారి చాటుకుంది. వారానికి ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయేలా కడప గడపలో నిర్వహిస్తున్న మహానాడు ప్రాంగణంలోనూ నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించేలా చేనేత స్టాళ్లను ఏర్పాటు చేయించింది. కడపలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేతన్నలు 11 స్టాళ్లను మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లను రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సందర్శించారు. ప్రతి స్టాల్ దగ్గరికి వెళ్లి… ఏయే ప్రాంతం నుంచి వచ్చారో అడిగి తెలుసుకున్నారు. వస్త్రాల నాణ్యత, తయారీ గురించి ఆరా తీశారు. చేనేత రంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు తీసుకుంటున్న నిర్ణయాలను, అమలు చేస్తున్న పథకాల గురించి నేతన్నలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు నేతన్నలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత చేనేత రంగానికి ఊతం వచ్చిందని ఆనందం వెలిబుచ్చారు. ప్రభుత్వపరంగా పథకాలు అమలు చేస్తూనే, చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగేలా తీసుకుంటున్న చర్యలతో ఆర్థికంగా గిట్టుబాటు అవుతోందని వారు మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె రూ.10 వేల విలువ చేసే చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. తనతో పాటు వచ్చిన అనుచరులతోనూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేయించారు. అనంతరం అక్కడే డ్వాక్రా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన ఫుడ్, ఇతర స్టాళ్లను కూడా మంత్రి సవిత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *