విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం-2025 (జూన్ 21, 2025) ను పురస్కరించుకొని బుధవారం (28.05.2025) పర్యాటక/ఐకానిక్ గమ్యస్తానాలైన గుంటూరు, పల్నాడు, శ్రీ పొటి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, జిల్లాల్లో ‘యోగాంధ్ర 2025’ లో భాగంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలు…
యోగా గురువులు, యోగా శిక్షకులు, వాలంటీర్లు, యోగాభ్యాసకులు, సాధారణ ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో పేర్లు నమోదు చేసుకుని పాల్గొనవచ్చు.. అంగన్వాడీ మరియు హెల్త్ వర్కర్స్ థీమ్ ఆధారిత యోగా ప్రదర్శనలు, పోటీలు, సామూహిక యోగాభ్యాసం వంటి కార్యక్రమాల నిర్వహణ.. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా ఉండవల్లి కేవ్స్, పలనాడు జిల్లా కోటప్పకొండ దేవాలయం ఆవరణలో, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ లో గల స్వర్ణాల చెరువు, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో గల సత్యమ్మ గుడి సర్కిల్ వద్ద యోగా నిర్వహిస్తారు.
బుధవారం యోగా సంఘాలు, యోగాభ్యాసకులు అంగన్వాడీ మరియు హెల్త్ వర్కర్స్ థీమ్ ఆధారిత కార్యక్రమాలను అన్నమయ్య జిల్లాలో నిర్వహించనున్నారు. ఈ యోగా పోటీల్లో 35 సంవత్సరాల పైబడిన వారు పాల్గొనవచ్చు.
యోగా కాంపిటేషన్స్: సోలో యోగాలో ఆసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణయామం, ధ్యానం వంటి విభాగాలు ఉంటాయి. గ్రూప్ యోగా, యోగా పాట, చిత్రలేఖనం, యోగా నాటకం మరియు నాట్యం, క్విజ్, పోస్టర్, నినాదం, వ్యాసం, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ, రంగోలి వంటి పోటీలు కూడా నిర్వహిస్తారు. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీటిని నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు స్థానిక ఆరోగ్య అధికారిని, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
Prajavartha Online Telugu News