Breaking News

ఎన్‌టీఆర్ వికాస ఆధ్వ‌ర్యంలో ఈ నెల 31న జాబ్‌డ్రైవ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ వికాస ఆధ్వ‌ర్యంలో ఈ నెల 31వ తేదీ శ‌నివారం విజ‌య‌వాడ క‌లెక్ట‌రేట్‌లోని వికాస కార్యాల‌యం ఆధ్వ‌ర్యంలో జాబ్‌డ్రైవ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు వికాస పీడీ కె.లచ్చారావు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జాబ్ డ్రైవ్‌లో దాదాపు 10 ప్ర‌ముఖ కంపెనీలు 200 ఉద్యోగాల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించ‌నున్నాయ‌న్నారు. శాండ్‌స్పేస్ టెక్నాల‌జీస్‌లో సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌, హెచ్‌1 హెచ్ఆర్‌లో క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ అసోసియేట్‌, డేటా వ్యాలీ కంపెనీలో ట్రైన‌ర్స్‌, సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్లు, ముత్తూట్ ఫైనాన్స్‌లో బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్‌, రిలేష‌న్‌షిప్ ఎగ్జిక్యూటివ్‌, వ‌రుణ్‌మోటార్స్ కంపెనీలో స‌ర్వీస్ అడ్వ‌యిజ‌ర్లు, టెక్నీషియ‌న్లు, అడ్మిష‌న్ యారో అండ్ అక‌డ‌మిక్ ఓవ‌రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కౌన్సిల‌ర్లు, డిజిట‌ల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్‌, మ‌ణ‌ప్పురం ఫైనాన్స్ లిమిటెడ్‌లో సేల్స్ అండ్ లోన్స్‌, హెచ్‌డీబీ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌లో బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌, రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్‌, ఫాక్స్‌కాన్ కంపెనీలో ఆప‌రేట‌ర్ ఉద్యోగాల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ ఉద్యోగాల‌కు ఎస్ఎస్‌సీ నుంచి పీజీ వ‌ర‌కు ఉత్తీర్ణులైన 35 ఏళ్ల‌లోపు అభ్య‌ర్థులు అర్హులని, వీరికి ఉద్యోగాల‌నుబ‌ట్టి నెల‌కు రూ. 12 వేలు నుంచి రూ. 40 వేల వ‌ర‌కు జీతం, భోజ‌న‌, వ‌స‌తి, ర‌వాణా సౌక‌ర్యాలు ఉంటాయ‌న్నారు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు ఈ నెల 31వ తేదీన ఎన్‌టీఆర్ వికాస కార్యాల‌యం, క‌లెక్ట‌రేట్‌, విజ‌య‌వాడలో ఉద‌యం 9 గంట‌ల‌కు స‌ర్టిఫికెట్లు జెరాక్సుల‌తో హాజ‌రుకావాల‌ని, మ‌రిన్ని వివ‌రాల‌కు 98494 65427 నంబ‌రులో సంప్ర‌దించాల‌ని పీడీ ల‌చ్చారావు సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *