Breaking News

ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం

,విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగ పాలన కాకుండా, సొంత రాజ్యాంగాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తుందని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జె పూర్ణచంద్రరావు వెల్లడించారు. రాష్ట్రంలోని బహుజన వర్గాలకు న్యాయం చేయాలని సంకల్పంతో ఆలిండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై విజయవాడ హనుమాన్ పేటలోని ఫర్నిచర్ మర్చంట్ అసోసియేషన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జె పూర్ణచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే లక్కే రాజారావు, బి పాంచ్ జన్యారావు, పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ పరంజ్యోతిరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరణికోట లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సొంత ఎజెండాను అమలు చేస్తూ, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతుందన్నారు. బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం సాధిస్తేనే బీసీలు అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కానీ, కూటమి ప్రభుత్వంలో కానీ మత్స్యకారులకు చాలా అన్యాయం జరుగుతుందని, గత ప్రభుత్వంలో గంగవరం పోర్టు ప్రైవేటీకరణ చేయడం వల్ల మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిలిందన్నారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించేందుకు తామ ఎప్పుడు ముందుంటామన్నారు. బహుజనులందరూ ఏకమై ఓటు ద్వారా రాజ్యాంగాధికారము చేపట్టిన నాడే బీసీల అభివృద్ధి జరుగుతుందని వారు స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *