Breaking News

వారసత్వంలోను సేవాగుణాలతో ప్రజల మన్నలు పొందుతున్న కాకాని వారసుడు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నెల నిర్వహించేటువంటి గొల్లపూడిలోని ఈవీఎం స్టోరేజ్ ఎన్నికల గోడౌన్ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో తనిఖీ నిర్వహించగా అరుదైన సంఘటన చోటు చేసుకుంది…మళ్ళీ సేవగుణం చాటుకున్న కాకాని వారసుడు..వివరాల్లోకి వెళ్తే.. వేసవికాలం ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్టీఆర్ జిల్లాలోని ఈవీఎం గోడౌన్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది కోరకు ఫ్యాన్లు సమకూర్చాలని అధిక ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నాం అని విజ్ఞప్తి చేయగా..వెంటనే స్పందించిన కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు మరియు ఎన్టీఆర్ జిల్లా బిజెపి నాయకులు కాకాని తరుణ్ వారి సిబ్బంది ద్వారా ఫ్యాన్లను సమకూర్చారు. ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల సిబ్బంది కాకాని తరుణ్ కు వెంటనే స్పందించి, ముందుకు వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ… తన వంతు సహాయం చేయడానికి ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుంటూ మార్గదర్శి గా నిలుస్తున్న డాక్టర్ తరుణ్ కాకానికి కృతజ్ఞతలు తెలిపారు.అదే స్పూర్తితో ఎన్నారైలు, స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, కార్పొరేటర్లు, ఇతర దాతలు ముందుకు వచ్చి ఎన్టీఆర్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డాక్టర్ తరుణ్ కాకాని మాట్లాడుతూ విజయవాడకు బుడమేరు వరదల సమయంలో కూడా తమ సంస్థ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళంగా అందించిందని గుర్తు చేశారు. అమరావతి బోటింగ్ క్లబ్ తరఫున ఎన్టీఆర్ జిల్లాకు ఎల్లప్పుడు వారి సహకారం అందిస్తామని తెలిపారు గతంలో కూడా అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏపీ. ఎస్.డి.ఆర్.ఎఫ్. తీవ్ర ఉష్ణోగ్రతతో ఇబ్బంది పడుతుంటే, వారి దృష్టికి వచ్చిన వెంటనే సిబ్బందికి ఫ్యాన్లు సమకూర్చామని గుర్తు చేశారు.. అమరావతి బోటింగ్ క్లబ్ అధినేత కాకాని తరుణ్ నేటితరం వారికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా వారి సేవలను కొనియాడారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *