అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీ, ఆదివారం నుంచి చౌక ధరల దుకాణాలను పునః ప్రారంభం చేస్తుంది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజక వర్గంలో చౌక ధరల దుకాణాలు మొదలవుతున్నాయి. పిఠాపురం పట్టణం 18వ వార్డులో చౌక ధరల దుకాణాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారు. అనంతరం శ్రీ సకిలేశ్వర స్వామి ఆలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. పిఠాపురం ఎ.ఎం.సి. ఛైర్మన్ పదవి బాధ్యతల స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు.
Tags amaravathi
Check Also
ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు
-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …
Prajavartha Online Telugu News