-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సి కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కె.ఎస్.జవహర్
-కె.ఎస్.జవహర్ కు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించిన ఎంపి కేశినేని శివనాథ్
-తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా కె.ఎస్.జవహర్ ప్రమాణ స్వీకార మహోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. తమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్ ఎస్సీ కమిషన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కె.ఎస్.జవహర్ కు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జరిగిందన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను అమలు చేయటం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అభివృద్ది, సంక్షేమం కోసం ప్రప్రథమంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి జస్టిస్ పున్నయ్య ను చైర్మన్ గా చేసి ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ సొంతమన్నారు. మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ కులాలకి సంబంధించిన సమస్యలను పరిష్కరించటంలో వారికి అండగా నిలబడతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అశీష్ లాల్, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, జిల్లా తెలుగు రైతు సంఘం అద్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు,గంపల గూడెం తెలుగు యువత అధ్యక్షుడు మాణికొండ రామకృష్ణ(ఎమ్.ఆర్.కె) టిడిపి సీనియర్ నాయకులు తాళ్లూరి రామారావు, టిడిపి నాయకుడు కొత్తపల్లి ఆనంద్ స్వరూప్, లతోపాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News