-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వేగుళ్ళ లీలా కృష్ణ ప్రమాణ స్వీకారం
-ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వెగుళ్ల జోగేశ్వరరావు హాజరు
-ఎంపి కేశినేని శివనాథ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన లీలా కృష్ణ
-లీలా కృష్ణకి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో కూటమి పొత్తు ధర్మం పాటించిన నాయకులందరికీ న్యాయం జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. గవర్నపేట లోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర జలవనరుల నిర్వహణ మరియు శిక్షణ కేంద్రం లో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వేగుళ్ళ లీలా కృష్ణ పదవీ బాధ్యత ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులు ఎంపి కేశినేని శివనాథ్, మండపేట ఎమ్మెల్యే వెగుళ్ల జోగేశ్వరరావు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన వేగుళ్ళ లీలా కృష్ణకు ఎంపి కేశినేని శివనాథ్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలపటంతోపాటు శాలువాతో సత్కరించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్టీయే కూటమి సందర్బంగా సీట్ల సర్దుబాటులో పొత్తు ధర్మం పాటించిన ముఖ్య నాయకుల్లో వేగుళ్ల లీలా కృష్ణ ఒకరని కొనియాడారు. టిడిపి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గెలుపులో లీలా కృష్ణ కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకు వెళ్లాల్సిన సమయం ఇదని.. పదవులు రాలేదని నాయకులు కార్యకర్తలు నిరాశ పడవద్దన్నారు.. అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో పలు కేసులతో పాటు అనేక దాడులు ఎదుర్కొన్న లీలా కృష్ణ భవిష్యత్తులో ఉన్నత పదవుల అలంకరించాలని ఆకాంక్షించారు. వేగుళ్ళ లీలా కృష్ణ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈకార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, జనసేన పార్టీ రాష్ట్ర నాయకుల అమ్మిశెట్టి వాసు, ప్రియా సౌజన్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తిరుమలరావులతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News