Breaking News

రాష్ట్రానికి కీర్తి.. దేశ‌భ‌క్తికి స్ఫూర్తి

– కీర్తిచక్ర మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడుకి సమగ్ర శిక్షా ఎస్పీడీ బి. శ్రీనివాస రావు అభినంద‌న‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మ‌న రాష్ట్రానికి కీర్తి.. దేశ‌భ‌క్తికి స్ఫూర్తి కీర్తిచక్ర మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు అని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి. శ్రీనివాస రావు ప్ర‌శంసించారు. ప్రతిష్టాత్మక కీర్తిచక్ర అవార్డు పొందిన ఆర్మీ మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు త‌న‌ కుటుంబంతో శుక్ర‌వారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ఎస్పీడీ బి. శ్రీనివాస రావుని కలిశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన మల్లా రాంగోపాల్ నాయుడు మరాఠా లైట్ ఇన్ ఫాంట్రీ, 56వ బెటాలియన్, రాష్ట్రీయ రైఫిల్స్ మేజర్ గా పనిచేస్తుండగా.. జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ దగ్గర దేశం కోసం ప్రాణాలకు తెగించి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి తోటి సైనికులను రక్షించారు. దీంతో మేజర్ రాంగోపాల్ నాయుడును మే 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారమైన కీర్తి చక్రతో సత్కరించారు. శౌర్య చక్రకు ఎంపికైన మొదటి తెలుగు వ్యక్తి రాంగోపాల్ నాయుడు దేశం కోసం చూపిన తెగువ‌ను ఎస్పీడీ ఈ సందర్భంగా ప్ర‌శంసించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *