Breaking News

మోడీ ఫిట్నెస్ మంత్రాకు సద్గురు ఉమర్ అలీషా మద్దతు

-యోగశక్తి సాధన సమితి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
11వ ఇంటర్నేషనల్ యోగ డే ఉత్సవాలు 2025 సందర్భంగా యోగ శక్తి సాధనా సమితి 21 రోజులపాటు నిర్వహిస్తున్న మోడీ ఫిట్నెస్ మంత్ర పై అవగాహన సదస్సు ఈరోజు పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో చిత్రాడ ప్రధాన ఆశ్రమం ఆధునిక మానవతా దేవాలయం నందు పీఠాధిపతి డాక్టరు ఉమర్ అలీషా స్వామి వారు సదస్సును ప్రారంభించి విచ్చేసిన భక్తులకు మోడీ ఫిట్నెస్ మంత్ర చాలా ఉపయోగకరమని డాక్టర్ మాకాల సత్యనారాయణ ద్వారా వివరాలు పూర్తిగా తెలుసుకుని మీరు సాధన చేస్తూ మీ చుట్టూ ఉన్న సమాజాన్ని చైతన్యం చేసి ఆరోగ్య విపత్తుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవలసిందిగా కోరాడు.అలాగే పంచ భూతాత్మకమైన మన దేహంలో అంతర అవయవాల పనితీరు క్రమ పద్ధతిలో రావడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. డాక్టర్ మాకాల సత్యనారాయణ వ్యవస్థాపక చైర్మన్ యోగ శక్తి సాధన సమితి మాట్లాడుతూ మోడీ ఫిట్నెస్ మంత్రాల లోని ఐదు అంశాలు ఒకటి చేతి కర్ర పద్ధతి ప్రకారం వాడకంతో ప్రాణశక్తి పునః శక్తివంతమై అవయవాల పనితీరు సమస్థితికి వస్తుందని ప్రాణ శక్తి పెరుగుతుందని దీనితో రుగ్మతలు తగ్గుతాయని, రెండవది బేర్ ఫుట్ వాడకం దీనివల్ల కళ్ల లో ఉండే ప్రెషర్ పాయింట్స్ ఉత్తేజితమై రోగాల బారిన పడే అవకాశం గణనీయంగా తగ్గుతుందని, మూడోది చెవుల మర్దన ద్వారా ఆరోగ్యం పెంపొందుతుందని, ఇది చాలా తేలికైన పద్ధతి అని ఎలాంటి సాధనాలు అవసరం లేదని తెలిపారు, నాలుగోది మెడిటేషన్ ద్వారా శక్తి సాధన చాలా తేలిక అని మరియు నమస్కారముద్రలో ఓంకార ప్రాణాయామ ద్వారా ప్రాణ శక్తి పెరిగి లంగ్ కెపాసిటీ పెరిగి,శ్వాసల సంఖ్య తగ్గి ఆయుష్ పెరుగుతుందని,రక్త శుద్ధి అంతర శుద్ధి,చక్రాసు జాగృతం అవడం ద్వారా మనిషి పరిపూర్ణ ఆరోగ్య జీవితం పొందుతాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వినర్ పేరూరి సూరిబాబు, పీఠం యాజమాన్యం సత్యనారాయణ,వంగర రేణుకా దేవి వంగర అంబికా దేవి సేవా కార్యక్రమాలు అందించారు.వందలాది మంది భక్తులు పాల్గొని సాధన చేసి తన తోటి వారికి ఈ కార్యక్రమాలు వివరాలు తెలిపి మోడీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పనిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమానంతరం కార్యక్రమం డా. ఉమర్ అలీషా గురూజీ యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ ను ఘనంగా సన్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *