విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వ్యవసాయ సహకారం) బుడితి రాజశేఖర్ ఐఏఎస్,రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్ విజయవాడ డివిజన్ లోని గోల్లపూడి రైతు సేవా కేంద్రము ను సందర్శించారు . పర్యటన ముఖ్య ఉద్దేశ్యం తెలుపుతూ ప్రస్తుతం విత్తన పంపిణీ జరుగుతున్న దరిమిలా,విత్తన పంపిణీ లో వినియోగిస్తున్న డి కృషి యాప్ ద్వారా చేపట్టిన విత్తనాల పంపిణీ ప్రామాణిక విధానాన్ని (SOP) పరిశీలించడం కోసం మరియు పంపిణీ విధానములో పరిపాలనా మరియు సాంకేతిక విభాగాల సమన్వయాన్ని అధ్యయనము చేయడం గురించి సందర్శించారు.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం & సహకార శాఖ) రాజశేఖర్ ఈ వ్యవస్థను క్షేత్ర స్థాయిలో సమీక్షించి, ప్రస్తుత విత్తన పంపిణీ విధానాన్ని బలోపేతం చేయడం, మెరుగుపరచడం, తద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, సులభంగా విత్తనాలు అందేలా లక్ష్యంగా పెట్టుకుని తగు విధమైన మార్పులు ,క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న పరిస్థితు లను తెలుసుకోవటం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. ఈ సందర్భంలో రైతు సేవా కేంద్రం లోని గ్రామ వ్యవసాయ సహాయకులు , రైతులతో ముఖాముఖి చర్చలు జరిపి, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు.
వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు , డి కృషి యాప్ రూపొందించిన NIC జాతీయ ఇన్ఫర్మేషన్ సెంటర్ సాంకేతిక బృందముతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సూచనలు ఇస్తూ, విత్తనాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతంగా, ఎటువంటి సమస్యల లేకుండా నిర్వహించేలా మార్పులను సూచించారు. రాష్ట్ర కమిషనరేట్ సంయుక్త సంచాలకులు (విత్తనాలు) కృపాదాస్ ఈ కార్యక్రమానికి సమన్వయం చేసారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తో ప్రస్తుత విత్తన పంపిణీ విధానము వివరాలు, అవసరమైన మార్పులపై చర్చించారు.
ఈ సందర్శనలో అదనపు సంచాలకులు (విత్తనాలు) వినయ్ చంద్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ కుమారి, సహాయ సంచాలకులు విజయవాడ బి.వి.రావు,వ్యవసాయ అధికారి విజయవాడ, ఏపీ సీడ్స్ విజయవాడ అధికారులు, సచివాలయ సిబ్బంది, మరియు రైతులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో రైతులకు వరి మరియు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ జరిగింది.
Prajavartha Online Telugu News