Breaking News

వార్షిక జీవనోపాధి ప్రణాళిక ప్రకారం డిజిటల్ ఎం సి పి (MCP) ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయాలి : జిల్లా కలెక్టర్

-బ్యాంకర్లు విద్యా రుణాలను సకాలంలో మంజూరు చేయాలి : జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వార్షిక జీవనోపాధి ప్రణాళిక ప్రకారం డిజిటల్ ఎం సి పి (MCP) ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు (DCC )జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్, ఆర్బిఐ ఎల్డీఎం గిరిదర్, ఎల్డీఎం గుంటూరు రవి కుమార్, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ సామంచి శర్మ , వివిధ బ్యాంకు అధికారులుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …వార్షిక జీవనోపాధి ప్రణాళిక ప్రకారం డిజిటల్ ఎం సి పి (MCP) ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. విద్యా హబ్ అయినా తిరుపతి జిల్లాలో పలు విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, విద్యకు సంబంధించిన రుణాల విషయంలో ప్రత్యేక ప్రాధాన్యతవిస్తూ రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. పి ఎం ఈ జి పి పథకం రుణాలు మంజూరైన యూనిట్లు అన్ని గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని ప్రైవేటు బ్యాంకులు రుణాల మంజూరు విషయంలో వెనకబడి ఉన్నాయని ఎలాంటి జాప్యం చేయకుండా రుణాలు మంజూరు చేయాలన్నారు. బ్యాంకర్లందరూ రుణాల మంజూరు లో నిర్దేశించబడిన లక్ష్యాలను అందిపుచ్చు కోవాలని సూచించారు. జిల్లాలో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉన్నందు వలన క్రాప్ లోన్ సంబంధించిన రుణాల విషయంలో బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కౌలు రైతు కార్డుదారులకు క్రాప్ లోన్ కి సంబంధించిన రుణాలను బ్యాంకర్లు సకాలంలో మంజూరు చేయాలనీ తెలిపారు..జిల్లాలో ఫైనాన్సియల్ లిటరసీ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ లావాదేవీల పై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్.బి.ఐ ఎల్డీఎం గిరిధర్, యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ సామంచి శర్మ తో కలిసి అనువల్ క్రెడిట్ ప్లాన్ తిరుపతి 2025_26 సంబంధించిన బుక్ రిలీజ్ చేశారు. ఈ సమావేశంలో నాబార్డ్ డి.డి.ఎం సునీల్, డిఆర్డిఏ పిడి శోభన్ బాబు, మెప్మా పీడీ రవీంద్ర, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *