Breaking News

జిఎంసి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు తమ నిత్య జీవితంలో యోగాని భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 చేపట్టిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. సోమవారం స్థానిక గాంధీ పార్క్ లో జిఎంసి ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమం జరిగింది. యోగా అనంతరం ప్రతిజ్ఞ చేపట్టారు.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మే 21 నుండి జూన్ 21 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2025లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థలో చారిత్రాత్మకమైన గాంధీ పార్క్ లో యోగా కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజలకు యోగ పట్ల అవగాహన కల్గించడం కోసం వార్డ్ సచివాలయాల వారీగా పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పటికే షుమారు 8 లక్షల మందికి పైగా యోగాంధ్రలో తమ వివరాలు నమోదు చేసుకున్నారని, జూన్ 21న ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భారీ యోగాకి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని కోరారు. తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు కోరిన విధంగా త్వరలో నగరంలో యోగా సెంటర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు నసీర్ అహ్మద్ మాట్లాడుతూ యోగా ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పొందడంతో పాటు సమాజం పట్ల స్పృహని కూడా కల్గిస్తుందన్నారు. యోగాని అన్ని వర్గాల ప్రజలు తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇప్పిటికే ప్రజల్లో యోగ పట్ల అవగాహన కల్గించడానికి గత 15 రోజులుగా జిఎంసి అనేక కార్యకమాలు చేపడుతందన్నారు. ప్రస్తుత పరిస్తితుల దృష్ట్యా నగరపాలక సంస్థ యోగా సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు.
డిప్యూటీ మేయర్ షేక్ సజిలా మాట్లాడుతూ మెరుగైన ఆరోగ్యానికి ఖర్చులేని ఔషదంగా యోగా ఉంటుందన్నారు. యోగాని ప్రతి ఒక్కరికీ తెలియచేయడానికి ప్రభుత్వం విరివిగా అవగాహన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాని సాధన చేయడం ద్వారా నిత్యం ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో ఎల్ఐడీసి చైర్మన్ పిల్లి మాణిక్యరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ డాక్టర్ విజయలక్ష్మీ, జిల్లా టూరిజం శాఖాధికారి శ్రీరమ్య, డిప్యూటి కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సి.హెచ్ శ్రీనివాసరావు, టి.వెంకటకృష్ణయ్య, బి,శ్రీనివాసరావు, ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, యోగా గురువు సాంబశివరావు బృందం, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *