Breaking News

దుర్గమ్మ భక్తులకు అదనపు సౌకర్యాలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ కనకదుర్గమ్మ వారి ఆర్జిత సేవల బుకింగ్, విరాళాలు చెల్లింపులు, ఇతర సమాచారం పొందుకోవడానికి విజయవాడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, తారాపేట మాడపాటి గెస్ట్ హౌస్, వన్ టౌన్ జమ్మి దొడ్డిలో ఉన్న దేవస్థానం కౌంటర్ లో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి వి. కె. శీనానాయక్ ప్రకటించారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు, అన్ని రకాల సేవలు, సమాచారం ఈ కౌంటర్ల లో భక్తులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఎక్కడ దేవస్థానం ఆఫీస్ లు, కౌంటర్లు ఉంటే అక్కడ అన్ని సేవా బుకింగ్, విరాళాల స్వీకరణ ఏర్పాటు చేస్తున్నామని,దుర్గమ్మ సేవలు అందరికి అందుబాటులోకి తేవడమే ప్రధానంగా పనిచేస్తున్నామన్నారు. కంప్యూటర్ ఆపరేట్ చేయగలిగే సామర్ధ్యం ఉన్న దేవస్థాన సిబ్బందికే ఈ కౌంటర్ లో విధులు కేటాయిస్తామని ఈవో వివరించారు. ఈరోజు ఉదయం రైల్వే స్టేషన్ 1 వ నెంబర్ ప్లాట్ ఫారం సమీపంలో ఉన్న దేవస్థానం కౌంటర్ ఈవో పరిశీలించారు. భక్తుల నిమిత్తం అన్ని ఏర్పాట్లు చేయవలసినదిగా ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *