Breaking News

యంత్ర పరికరాల ద్వారా వ్యవసాయ రంగంలో మెరుగైన ఫలితాలు

-రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల అందజేత
-జిల్లాలో 675 యూనిట్స్ కి రూ .3 కోట్ల 58 లక్షల మేర రాయితీ
-ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచాలి
-అంతర పంటలపై దృష్టి సారించాలి
-జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
యాంత్రీకరణ విధానం ద్వారా వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి చెప్పారు. గ్రామ, మండల స్థాయిలో ఉన్న వ్యవసాయ యంత్ర పరికరాలను రైతన్నలు పరస్పరం మార్పిడి చేసుకోవడం ద్వారా వ్యవసాయ ఖర్చులు తగ్గించుకోవచ్చని సూచించారు.

బుధవారం ఉదయం కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెంలో గ్రామంలో కలెక్టర్ వ్యవసాయ యాంత్రీకరణ యూనిట్స్ ను లబ్దిదార రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ… జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ యూనిట్స్ ఏర్పాటుకు సంబంధించి 211 రైతు సేవా కేంద్రాల పరిధిలో 675 వివిధ యూనిట్స్ గ్రౌండింగ్ చేసినట్లు చెప్పారు. వీటి ద్వారా రూ.3, 58,27,637 /- లు సబ్సిడీ రూపంలో రైతులకు ప్రయోజనం చేకూర్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. రైతు సేవా కేంద్రాల పరిధిలో అందుబాటులో ఉన్న వ్యవసాయ యాంత్రీకరణ, ఆధునిక పరికరాలు, యూనిట్స్ ను అవసరానికి అనుగుణంగా ఒకరికొకరు యిచ్చిపుచ్చుకుని , వాటి ద్వారా పొందే ప్రయోజనాలు అందరికీ అందుబాటులో దక్కేలో చూసుకోవాలి అని స్పష్టం చేశారు. అదే విధంగా డ్రోన్ టెక్నాలజీ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగులు మందులు వెదజల్లే ప్రక్రియ ను వ్యవసాయ సాగు పద్ధతుల్లో అమలు చేయడం జరుగుతోందని కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. అందువలన క్రిమి సంహారక మందులు ప్రభావం రైతులపై పడే అవకాశం తక్కువ స్థాయిలో ఉంటుందని తెలియ చేశారు. వృధా ను గణనీయంగా తగ్గించడం ఈ ప్రక్రియలో సాధ్యం అవుతుందని తెలిపారు. ఒకరి వద్ద ఉన్న యాంత్రీకరణ యూనిట్స్ మరొకరితో పంచుకోవడం పై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు.

పంట మార్పిడి విధానాలు స్వాగతించాలనీ, ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచడం పై దృష్టి సారించాలని కలెక్టర్ కోరారు. అదే సమయంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పై దృష్టి సారించాలని కోరారు. తద్వారా భూమి సారవంతం అవ్వడం, మేలైన దిగుబడులు సాధ్యం అవుతుందని తెలిపారు. జీవ సంబంధమైన వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తున్న విషయం ప్రతి ఒక్కరికీ విదితమే అన్నారు. నేటి ఆధునిక కాలంలో వ్యవసాయ రంగంలో మార్పులు గమనించి ఉత్తమ సాగు విధానాలు అవలంబించాలని సూచించారు. హార్టికల్చర్ రంగం ద్వారా అంతర పంట సాగు విస్తీర్ణం ఎంతో ప్రయోజనం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. సత్యసాయి త్రాగునీటి సరఫరా ప్రొజెక్ట్ సమస్య పరిష్కారం పై దృష్టి సాధించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, సహాయ సంచాలకులు మల్లికార్జున రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *