-అన్ని గ్రామాలలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావాలి.
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణ నారావారిపల్లె -2029 అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను త్వరితగతిన సిద్దం చేసి పనులు చేపట్టాలని, అన్ని గ్రామాలలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
మంగళవారం సాయంత్రం స్థానిక కల్లెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్వర్ణ నారావారిపల్లె -2029 అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక అధికారిని శ్రీమతి సుశీల దేవి మరియు సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
స్వర్ణ నారావారి పల్లె -2029 లో భాగంగా జరగనున్న అభివృద్ధి కార్యక్రమాలపై అన్ని శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించి, నారావారిపల్లి అభివృద్ధిని త్వరితగతిన పనులు పూర్తి అయ్యేటట్లు ప్రణాలికను సిద్దం చేసుకొని, అనుమతులు కావాల్సిన శాఖల ద్వారా పరిపాలనా ఉత్తర్వులను పొంది పనులను ప్రారంబించి పూర్తి చేయాలని తెలిపారు.
వివిధ శాఖాధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం సహాయ సంఘాలకు (SHGs) రుణాలు మంజూరు చేయాలని, రిటైల్ అవుట్‌లెట్‌లు ఈజీమార్ట్ సహకారంతో రిటైల్ అవుట్‌లెట్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ రంగానికి సంబంధించి కిచెన్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్‌పై గుర్తించబడిన కుటుంబాలకు శిక్షణ ఇవ్వాలని, వరి పొలాల్లో ధ్రవ జీవామృతం సుమారు 1000 ఎకరాలలో పిచికారి చేయాలనీ, రైతుల పొలాల్లో PMDS కిట్ల ఏర్పాటు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 100% సోలరైజేషన్ సంబంధించిన పంచాయతీల్లో సర్వీసులను త్వరగా సోలరైజ్ చేయాలని, విద్యా రంగానికి సంబంధించి అన్ని పాఠశాల భవనాలను, డిజిటల్ లైబ్రరీ, మైదానం లెవలింగ్ వంటి వసతుల కల్పన ఏర్పాటు చేయాలని, ఆరోగ్య & మహిళా సంక్షేమం ద్వారా మహిళా పోలీసులకు ఆన్‌సైట్ స్క్రీనింగ్ అప్లికేషన్‌లపై శిక్షణ, 8 అంగన్‌వాడీ కేంద్రాల్లో AI ఆధారిత స్క్రీనింగ్‌ల 100% పూర్తి చేయాలని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి ద్వారా CC రోడ్లను, త్రాగునిటీ ట్యాంక్లు, 33/11 కె వి ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్లు పూర్తి చేయాలని తెలిపారు. నారావారిపల్లి CHC, CSC యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, IHHL (వ్యక్తిగత మరుగుదొడ్లు) పనులు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలని, స్వచ్ఛత కోసం హోం కంపోస్టింగ్ లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని సంబందిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఎస్.సి, ఎస్.టి లకు అందించిన ఈ – ఆటో ల వలన రోజు వారి ఆదాయం గతంతో పోలిస్తే ఎంత ఆదాయ రాబడి వస్తుందో తెలుసుకోవాలని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంత మందికి శిక్షణ ఇచ్చారో, ఎంత మందికి ఉపాది కల్పించారని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో ఎటువంటి అసాంఘీక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా చూడాలని సంబందిత స్కూల్ ప్రధాన ఉపాద్యాయులను ఆదేశించారు. పల్లె వనం లు ఏర్పాటు చేయాలనీ, క్యాటిల్ షెడ్ లు అన్ని 100 శాతం పూర్తి చేయాలనీ, విద్యా శక్తి కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. అలాగే మిగిలిన శాఖల వారు కావలసిన పరిపాలన అనుమతులను పొంది స్వర్ణ నారావారిపల్లి – 2029 అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారిని శ్రీమతి సుశీల దేవి, డిఆర్డిఏ పిడి శోభన్ బాబు, డ్వామా పిడి శ్రీనివాస్ ప్రసాద్, డిఎం అండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్, సి పి ఓ వెంకటేశ్వర్లు, పశుసంవర్ధక శాఖ ఏ.డి డా.ఏ.ప్రసాద్, ఏపీఎంఐపి సతీష్, మార్కెటింగ్ ఏ.డి సురేంద్ర బాబు, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్.ఈ సురేంద్ర నాయుడు, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్.ఈ పి.వి నరేంద్ర కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఏ.ఎస్ రాజు, పి.డబ్యు.సి కో-ఆర్డినేటర్ వెంకట్, విద్యా శాఖ, ఐ.సి.డి.ఎస్, నెడ్ క్యాప్, ఆర్ &బి, అటవీ శాఖ, టూరిజం, పిడి గృహ నిర్మాణ శాఖ అధికారి మరియు స్వర్ణ నారావారి పల్లి – 2029 కి సంబందించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News