-కొండ ప్రాంతాల్లో ప్రమాదకరమైన నివాసాలలో నివసిస్తున్న వారిని వెంటనే తరలించండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలదృశ్య కొండ ప్రాంతంలో ప్రమాదకరమైన నివాసాలలో నివసిస్తున్న ప్రజలను వెంటనే తరాలించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా పంజా సెంటర్, చిట్టినగర్, కబేళా, లేబర్ కాలనీ, వర్క్ షాప్ రోడ్, కుమ్మరిపాలెం సెంటర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కొండ ప్రాంతాలలో ప్రమాదానికి అవకాశం ఉన్న ఇళ్లలో నివసిస్తున్న ప్రజలకు అవగాహన కల్పించి ఇంటి నుంచి తరలించి వారికి సురక్షమైన ఇళ్ళను కేటాయించాలని కబేళాలో జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లను పరిశీలించి అధికారులను ఆదేశించారు. నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ లో భాగంగా చిట్టినగర్ లో ఉన్న నైట్ షెల్టర్ హోమ్స్ లో అక్కడ వచ్చే నిరాశ్రయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, నగరంలోన నిరాశ్రయులందరికి షెల్టర్ హోమ్స్ లో వసతి కల్పించాలని అందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అధికారులను ఆదేశించారు. పంజా సెంటర్ కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వద్ద జరుగుతున్న డీసెల్టింగ్ పనులను పరిశీలించారు. లేబర్ కాలనీలో జరుగుతున్న కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లో అన్న క్యాంటీన్ పరిశీలించి, పారిశుద్ధ్య నిర్వాహణకు అధికారులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధను అభినందిస్తూ నగర పరిధిలో గల అన్ని అన్న క్యాంటీన్లలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు ఇటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ పనుల్లో పురోగతి వేగవంతం చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పని ఇచ్చిన ప్రతి కాంట్రాక్టర్ పని పూర్తి చేయాలని అధికారులు పర్యవేక్షిస్తుండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జున్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, పర్యవేక్షణ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి. వెంకటనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత, డి ఎఫ్ ఒ మాల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News