-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఫిర్యాదును అధికారులు క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు.
ప్రధాన కార్యాలయంలో నిర్వహించడమే కాకుండా జోనల్ కార్యాలయం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. గతవారం ఫిర్యాదు చేసిన దరఖాస్తుల్లో పునరావతం అయిన ఫిర్యాదులను సమీక్షించారు. పునరావతం అవ్వకుండా ప్రజల ఫిర్యాదులను ఎలా పరిగణించాలి, ఎలా పరిశీలించాలి, ఎలా పరిష్కరించాలి వంటి అంశాలపై అధికారులకు సూచించారు. తదుపరి పురమిత్ర ఆప్ ద్వారా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు వంటి అంశాలపై చర్చించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యను అర్థం చేసుకొని శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పురమిత్రలో వచ్చే ప్రతి సమస్యను కచ్చితంగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 22 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 10, ఇంజనీరింగ్ 8, వైద్య & ఆరోగ్యం 1, హార్టికల్చర్ 3 మొత్తం కలిపి 22 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్). డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జున్ రావు, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి. సత్యకుమారి,పి సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లతా, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్ర శేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, బయాలజిస్ట్ కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News