-విజయనగరం జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పూర్తి చేసిన పెనుమర్తి బుజ్జిబాబు
రాజమహేంద్రవరం/ అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయనగరం గురజాడలోని జేఎన్టీయూ నుంచి పీహెచ్డీ పూర్తి చేసిన పెనుమర్తి బుచ్చిబాబుకు జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ డి. రాజ్యలక్ష్మి చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు రిజిస్టర్ ప్రొఫెసర్ జయసుమ బుధవారం ఒక ప్రకటనలు తెలియజేశారు. విశ్వవిద్యాలయం నుంచి అన్ని అకాడమిక్ పరిశోధన ప్రమాణాలను బుజ్జిబాబు విజయవంతంగా పూర్తి చేశాడని ఆమె తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పేరా రామచంద్రపురం గ్రామానికి చెందిన పెనుమర్తి బుజ్జిబాబు సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సుదీర్ఘ కాలం పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఉన్నత విద్యలో భాగంగా జేఎన్టీయూ విజయనగరం నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ భాగంలో పెర్ఫార్మన్స్ వేల్యూషన్ ఆఫ్ డిజిటల్ ఐఐఆర్ ఫిల్టర్ ఫర్ లో పవర్ అప్లికేషన్ అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. ఈ పరిశోధనాను అంతర్గత, బాహ్య పరిశీలకుల నుంచి ప్రశంసలు లభించాయన్నారు. బుజ్జి బాబు చేసిన పరిశోధన ఫలితాలు సంబంధిత రంగాల్లో నూతన వరుడిని చూపగలదని కొనియాడారు. బుజ్జిబాబు పీహెచ్డీ డాక్టరేట్ సంపాదించడంతో ఆయనకు మందపల్లి సత్తిబాబు, రెడ్డయ్య, రమేష్, తేజ్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News