Breaking News

జగన్మాత సన్నిధిలో గణపతి హోమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి ‬పూజ . గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి. సంకటహర చతుర్థి పూజ ఆచరించడం వలన జాతకములోని సమస్యలు తొలగి,అన్ని పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని పురాణోక్తి. ఆది పరాశక్తి, జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వేంచేసిన విఘ్నాధిపతి అయిన గణపతిని సంకట హర చతుర్థి సందర్బంగా సోమవారం ఉదయం భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజ, హోమములను మంత్ర పూర్వకంగా అర్చక స్వాములు జరిపించారు. ఆలయకార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ హోమం, అభిషేకం పూజలలో పాల్గొన్నారు. స్థానాచార్య వి. శివ ప్రసాద్ శర్మ, వేద పండితులు, అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు ఆశీర్వచనం, ప్రసాద వితరణ చేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *