విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ రోజు వేలాది మంది భక్తులు విచ్చేసే దేవస్థానంలో భక్తుల భద్రత రీత్యా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని దేవస్థానం ఆర్ సి నెం. ఎ 1/1435/2025 తేది 03.07.2025 ప్రకారం కార్యనిర్వాహణాధికారి వి. కె శీనానాయక్ జిల్లా అగ్నిమాపక అధికారులకు వ్రాసిన లేఖ కు ఆ శాఖ స్పందించింది. జూలై 11న అగ్నిమాపక అధికారుల బృందం, దేవాలయం ఇంజినీరింగ్ సిబ్బంది ఇంద్రకీలాద్రి ఆణువణువూ పరిశోదించారు. ఈరోజు ఉదయం ఆలయ ఈవో ని కలిసిన అగ్నిమాపక అధికారులు ఒక నివేదిక సమర్పించారు. మహా మండపం, లడ్డు తయారీ, అన్న ప్రసాదం, అమ్మవారి నైవేద్యం వంట శాల వంటి ప్రాముఖ్య ప్రదేశాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి సూచించారు. అమ్మవారి మీద అపార భక్తి శ్రద్దలతో ఇంద్రకీలాద్రి కి వస్తున్న భక్తుల భద్రత ప్రధానంగా భావిస్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అగ్నిమాపక శాఖ అధికారులు సూచించిన ప్రకారం ఏర్పాటు చేయడానికి వెంటనే టెండర్లు పిలవాలని ఇంజినీరింగ్ విభాగం వారిని ఆదేశించానని ఈవో శీనా నాయక్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News