Breaking News

డ్రైనేజి సమస్యల పరిష్కారంకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని డొంక రోడ్ 3 వంతెనల వద్ద వర్షం నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకు పరిష్కారంగా రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహ్మద్ నసీర్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో రైల్వే ఇంజినీర్లు, జిఎంసి ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులతో 3 వంతెనల దగ్గర డ్రైనేజి సమస్యల పరిష్కారంకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మేయర్, కమిషనర్, ఎంఎల్ఏ లు మాట్లాడుతూ డొంక రోడ్ వద్ద 3 వంతెనల మార్గంలో రైల్వే శాఖ ట్రాక్ ఎక్స్ టెన్షన్ నిర్మాణం కోసం చేపట్టిన పనుల్లో భాగంగా డ్రైన్ పూర్తీ స్థాయిలో నిర్మాణం చేయకపోవడం వలన ప్రజలు వర్షాలు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. త్వరలో శంకర్ విలాస్ వంతెన్ పనులు పూర్తీ స్థాయిలో చేపడితే గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల అనుసంధాన మార్గంగా 3 వంతెనల మార్గం ఉంటుదన్నారు. కనుక తక్షణం డ్రైన్ డైవర్షన్ పనులు ప్రారంభించాలన్నారు.
సమావేశంలో సిటి ప్లానర్ రాంబాబు, ఈఈలు సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, రైల్వే ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *