తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాల క్రష్ణ నాయక్ జిల్లా లోని వైద్య సంస్థలు పాటించ వలసిన నియమాల గురించి ఈ రోజు తెలియ జేస్తూ ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్స్, ల్యాబ్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లు నిర్వహించే ప్రతి ఒక్కరూ ప్రజలకు తెలిసే విధంగా సేవల రేట్ల వివరాలను నోటీసు బోర్డులలో తప్పక పెట్టాలని తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ అల్లోపతిక్ ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం 2002 అపెండిక్స్ రూల్(3) ప్రకారం ప్రతి ప్రైవేటు ఆసుపత్రి లో క్లినిక్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ల్యాబ్‌ల నందు ఆ సంస్థ వారు అందించే ప్రతి రకమైన సేవకు వసూలు చేసే రేట్ల వివరాలను స్థానిక మరియు ఆంగ్ల భాషలలో రోగుల ప్రయోజనం కొరకు రిసెప్షన్ కౌంటర్ నందు కనిపించే విధంగా రేట్లు వివరాలు ప్రదర్శించ వలెనని సూచించారు. కనీస సేవల జాబితా ను అనుబంధ సంస్థలకు పంపడం జరిగింది కావున మేనేజ్మెంట్ వారు వెంటనే వసూలు చేస్తే రేట్ల వివరాలను వారం రోజుల లోగా demotirupati@gmmail.com ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కు విధిగా అందజేయాలని కోరారు. వారం లోపు వివరాలను పంపని వారి పై ఆంధ్ర ప్రదేశ్ అల్లో పతిక్ ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం 2002 నవంబర్ 9 ప్రకారం తగు చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News