-అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని, తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదు:
-జిల్లాలో పి ఫోర్ సర్వే కార్యక్రమంను వేగవంతం చేసి ఆగస్టు 15 నాటికి లక్ష్యాన్ని కి చేరుకోవాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా రీ ఓపెన్ కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా, రెవెన్యూ డివిజన్, మండల, తదితర అధికారులతో వర్చువల్ గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) అర్జీలు పరిష్కారంపై జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డి ఆర్ ఓ నరసింహులు తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని (PGRS) లో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని, ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. పరిష్కారo చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని, తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదని ఆదేశించారు. రీ ఓపెన్ కి తావు లేకుండా పరిష్కారం చూపాలని అన్నారు. ప్రతి సోమవారం అన్ని మండల పరిధిలో, డివిజన్ పరిధిలో తప్పని సరిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలని, ఈ కార్యక్రమం నిర్వహించు ప్రదేశం, సమయం అర్జిదారులకు తెలిసేలా సమాచారం ఇవ్వాలి అని అన్నారు. అర్జీదారులు వారి సమస్యకు పరిష్కారం కొరకు పీజీఆర్ఎస్ కు రావడం జరుగుతుందని సంబంధిత అధికారులు అర్జీ దారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానoగా విని సంతృప్త స్థాయిలో పరిష్కారo చూపాలని అన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ ఎల్ ఎ కు వెళ్లకుండా రోజువారీగా అర్జీలను రిఓపెన్ చేసి చూసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తప్పుడు ఎండార్స్ మెంటు లేకుండా చూడాలని అన్నారు.
రాష్ట ప్రభుత్వం పేదరికం నిర్మూలన దిశగా పి – 4 కార్యక్రమాన్ని తీసికొని వచ్చిందని ఇది చాలా మంచి కార్యక్రమం అని, సంబంధిత అధికారులను ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో బంగారు కుటుంబాలను, మార్గదర్శకులను ట్యాగ్ చేయడం జరిగింది అని అన్నారు. ఉన్నత స్థితిలో ఉన్న టాప్ 10 పర్సెంట్ వాళ్ళు బాటమ్ 20 పర్సెంట్ వారిని దత్తత తీసికొని వారి ఆదాయం పెరిగేలా ఆర్థిక అసమానతలు తగ్గించేలా కృషిచేయాలని తెలిపారు. పి ఫోర్ సర్వే కార్యక్రమంను వేగవంతం చేసి బంగారు కుటుంబాలను గుర్తించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ఆగస్టు 15 కల్లా జిల్లాలో ఇచ్చిన లక్ష్యానికి చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రోస్మాండ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News