తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ దినము తిరుపతి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్స్యైజ్ అధికారి నాగ మల్లేశ్వర రెడ్డి మరియు AES వాసుదేవచౌదరి ల ఆదేశాల మేరకు, తిరుపతి రూరల్ ఎక్స్యైజ్ CI నరసానాయుడు మరియు ESTF CI శ్యాంప్రసాద్ లు సంయుక్తంగా తనపల్లె ఇందిరమ్మ ఇండ్లలోని బ్లాక్ నెం. 68 (5 to 8) బిల్డింగ్ వద్ద దాడులు జరిపి, (650).గ్రాముల గంజాయి స్వాదీనం చేసుకుని కుట్టి సతీష్ అను వ్యక్తిని అరెస్ట్ చేసినారు. కుట్టి సతీష్ కు ఈ నెల 1వ తేదీన గంజాయిని సరఫరా చేసిన బాక్యరాజ్ అను ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ కేసులోని ఇద్దరు వ్యక్తులపై పాత కేసులు ఉన్నాయని, కుట్టి సతీష్ పై 2023 సంవత్సరం లో చంద్రగిరి పోలీస్ స్టేషన్ నందు మరియు బాక్యరాజ్ పై (15).రోజుల క్రితం తిరుచానూరు పోలీస్ స్టేషన్ నందు గంజాయి కేసులు నమోదు అయ్యాయని తెలిపినారు. దాడుల్లో SIలు స్వామినాథన్, కవిశ్వరనాయుడు, హెడ్కానిస్టేబుళ్ళు మంజునాథనాయుడు, రమేష్, కానిస్టేబుళ్ళు వేణుగోపాల్, మునిరెడ్డి, డేవిడ్, రూప్ కుమార్ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News