Breaking News

మెగా వాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ డివిజన్ లో మంగళవారం నిర్వహించే మెగా వాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ సంబందిత అధికారులను ఆదేశించారు. సోమవారం విజయవాడ రురల్ మండలం పాతపాడు,రామవర్పడు-1 సచివాలయాలను ఆయన సందర్శించారు. పాతపాడు సచివాలయంలో మెగా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహణ ఏర్పాట్లుపై జరిగిన సమావేశంలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం నిర్వహించే కోవిడ్ టీకాలు వేసే మెగా డ్రైవ్ నూరు శాతం విజయవంతం కావాలన్నారు. 18 ఏళ్ళు నిండిన వారి జాబితాలను అనుసరించి వారందరికీ టీకాలు వేసేలా చూడాలన్నారు. గ్రామ సచివాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచాలన్నారు. సచివాలయాల్లో అందిస్తున్న సేవల తీరు, నిర్వహిస్తున్న రిజిస్ట్రార్ల ను,సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ప్రదర్శించడం ,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసి గోడ పత్రికలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. సేవలకు సంబంధించి ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్త వహించాలన్నారు. సచివాలయంలో అందిస్తున్న సేవల వివరాలను పోస్టర్ల ద్వారా తెలియజేయాలన్నారు. వీరి వెంట రూరల్ తహసీల్దార్ బి.శ్రీనివాస్ నాయక్, ఎంపిడివో సునీత తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *