

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ సైనికుల సహకార ఆరోగ్య కేంద్రం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని జనరల్ ఆఫీస్ కమాండర్ మేజర్ జనరల్ ఆర్.కె.సింగ్ అన్నారు. రాష్ట్రంలో ఒకరోజు పర్యటనలో భాగంగా సోమవారం నగరంలో గవర్నర్ పేట అరండాల్ పేటలోని మాజీ సైనికుల సహకార ఆరోగ్య కేంద్రాన్ని(ఇ సి హెచ్ ఎస్ పాలీక్లినిక్) ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆఫీసర్ ఇంచార్జి కల్నల్ పాలేటి రాంబాబు స్వాగతం పలికి పాలీక్లినిక్ సిబ్బందిని పరిచయం చేసారు. మాజీ సైనికులకు కోవిడ్ సమయంలో నూరు శాతం మందులు, ఇతర వైద్య పరికరాలు సరఫరా చేసినందుకు జిఓసి మేజర్ జనరల్ ఆర్ కె సింగ్ కు మాజీ సైనికులు, సిబ్బంది తరపున రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. పాలిక్లినిక్ నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో పాలీ క్లినిక్ ద్వారా మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం చేసిన సేవలకు ఆయన సిబ్బందిని అభినందించారు.మాజీ సైనికులు, వారి కుటుంబాలకు అవసరమైన వైద్యం అందించడం తో పాటు అవసరమైన అన్ని మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవలన్నారు.
Prajavartha Online Telugu News