Breaking News

35ల‌క్ష‌ల తో ఎర్ర‌క‌ట్ట డౌన్ పార్క్ ప‌నులు… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో కేదారేశ్వర పేట ఎర్రకట్ట డౌన్ నందు చేపట్టిన పార్క్ అభివృద్ధి పనులను కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో క‌లిసి మంగ‌ళ‌వారం ప‌రిశీలించి, అధికారుల‌కు పలు సూచనలు చేసారు. 35 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో చేప‌డుతున్న పార్క్ అభివృద్ది ప‌నులు 15 రోజులు పూర్తి చేయాల‌న్నారు. 150 మీట‌ర్లు వాకింగ్ ట్రాక్, ఇతర సివిల్ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. అదే విధంగా పార్క్‌ నందు గ్రీనరీ పనుల‌తో పాటు ప్రహరీ గోడ (కాంపౌండ్ వాల్ ) నిర్మాణం ప‌నులు పూర్తి చేయాల‌న్నారు. ఎంట్ర‌న్స్ ప్లాజ‌, చిన్నారుల ఆడుకోనే ఆట వ‌స్తువులు, షటిల్ కోర్టు నిర్మాణం, సిటింగ్ ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. అనంత‌రం కేదారేశ్వర పేట సెంట్రల్ వైర్ హౌస్ రోడ్ నందు సి.సి రోడ్ పనులు క‌మిష‌న‌ర్ పరిశీలించారు. కార్యక్రమము ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వై వి కోటేశ్వ‌ర‌రావు, కె.నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *