-విజయవాడ నగర పాలక సంస్థ సిబ్బందికి సహకరించండి- కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొండ ప్రాంతాలలో వరద ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని విజయవాడ నగర పాలక సంస్థ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఆదివారం సాయంత్రం శాఖాధిపతులు, స్పెషల్ ఆఫీసర్లతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ టెలి కాన్ఫరెన్స్లో కొండ ప్రాంతాలలో మరియు వరద ముంపు ప్రాంతాలలో ప్రమాదానికి గురి అయ్యే అవకాశమున్న ఇల్లులు ఎన్ని అందులో నివసిస్తున్న ప్రజలు ఎంతమంది ఉన్నారు అని అసిస్టెంట్ సిటీ ప్లానర్లను అడగగా, సర్కిల్ 1 అసిస్టెంట్ సిటీ ప్లానర్ చంద్రబోస్ కొండప్రాంతాలలో ప్రమాదానికి గురి అయ్యే ఇళ్లు 10 ఉన్నాయని, సర్కిల్ 3 అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు 15 ఉన్నాయని, 15లో అత్యంత ప్రమాదానికి గురి అయ్యే ఇల్లు రెండు ఉన్నాయని, వారికి ఎంత అవగాహన కల్పించిన వారు ఇప్పుడు కాదు తర్వాత వెళ్తామంటూ దాటేస్తున్నారని తెలిపారు. కమిషనర్ ధ్యానచంద్ర కొండ ప్రాంతాలలో ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉన్న ఇళ్లను పూర్తిస్థాయిలో పరిశీలించి సంపూర్ణ నివేదికను తమకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వరద హెచ్చరికలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జారీ చేసి దగ్గర నుంచి విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు వరద ముంపు, కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి సురక్షిత ప్రదేశాలకు తరలిరావాలని అవగాహన కల్పిస్తున్నప్పటికీ వారు వినని పక్షంలో పోలీసులు, రెవెన్యూ శాఖ సహకారంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి ముంపు ప్రాంతానికి దగ్గరలో అన్ని వసతులు కల్పించిన ఒక పునరావసకేంద్రం ఉండేటట్టు కచ్చితంగా చూసుకోవాలని ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ ను ఆదేశించారు. ప్రతి పునరావాస కేంద్రంలో ప్రజలకు భోజనం సదుపాయాలకు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్లు తమ తమ వార్డుల్లో గల వర్ధమపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రత్యేక శ్రద్ద తీసుకొని వారికి కచ్చితంగా అవగాహన కల్పించి హెచ్చరికలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News