-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్లడ్ రెస్పాన్స్ టీం అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. ఆదివారం సాయంత్రం రామలింగేశ్వర నగర్ సాయిరాం కట్ పీసెస్ వీధి చివర గల రిటైనింగ్ వాల్ వద్ద ఫ్లోడ్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల వరద ముంపు ప్రాంతాలలో ముందు జాగ్రత్త చర్యలుగా ఫ్లడ్ రెస్పాన్స్ టీం లను అక్కడ మూడు షిఫ్ట్ లలో అందుబాటులో ఉండాలని, మిషనరీ అంతా దానికి తగ్గట్టుగా అందుబాటులో ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బంది తలెత్తని ఇవ్వకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News