గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ను సోమవారం (18-08-2025) మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునన్నారు. అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసుకోవాలంటే *1100 (డబల్ వన్ డబల్ జీరో) కి నేరుగా కాల్ చేయవచ్చని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చునన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News