గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల వద్దనుండి వచ్చే పిర్యాదులను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు నిర్వహించిన (పి.జి.ఆర్.యస్) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని, ప్రజల వద్ద నుండి పిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి (పి.జి.ఆర్.యస్) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాదాన్యతనిస్తున్నారని, అధికారులు మరియు సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, ప్రజల నుండి వచ్చే పిర్యాదులను అధికారులు నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా త్రాగు నీరు, పారిశుధ్యం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించి, మరల సదరు పిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రజల పిర్యాదులను పరిష్కరించు సమయంలో అధకారులు క్షేత్ర స్తాయిలో పర్యటించాలన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, నగర పాలక సంస్థ డిప్యుటీ కమిషనర్లు డి. శ్రీనివాసరావు, బి. శ్రీనివాసరావు, సి.హెచ్ శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ రాంబాబు, ఇన్చార్జి యస్.ఈ సుందర్ రామిరెడ్డి, ఈ.ఈ కోటేశ్వరరావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ఇంచార్జి యం.హెచ్.ఓ రామారావు, పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News