Breaking News

నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్)లో భాగంగా ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు నగరపాలక సంస్థ ప్రణాళికాబద్దంగా ఎండ్ టు ఎండ్ రోడ్ల నిర్మాణం, మిషన్ గ్రీన్ గుంటూరు ద్వారా పచ్చదనం పెంపు వంటి చర్యలు తీసుకుంటుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్)లో భాగంగా నగరంలో చేపట్టాల్సిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో కమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వాయు కాలుష్యం తగ్గించి, ఆహ్లాదకరమైన వాతావరణంను ప్రజలకు అందించేందుకు మిషన గ్రీన్ గుంటూరులో భాగంగ దశల వారీగా 5 లక్షల మొక్కలు నాటేలా కార్యాచరణ సిద్దం చేశామన్నారు. నగరంలో నూతనంగా చేపట్టే రోడ్లను ఎండ్ టు ఎండ్ ఏర్పాటు చేస్తున్నామని, నగర పరిధిలోని ఆర్&బి రోడ్లను కూడా జిఎంసికి కేటాయించాలని కౌన్సిల్ ల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపామన్నారు. తద్వారా ప్రధాన రోడ్లలో కాలుష్య నియంత్రణ చర్యలు పటిష్టంగా చేపట్టడానికి వీలు కల్గుతుందన్నారు. ఇప్పటికే రోడ్ల పై పడిన వర్షం నేరుగా డ్రైన్ ల్లోకి వెళ్లకుండా అడ్డుగా ఉన్న ఆక్రమణల తొలగింపు చేపట్టామని తెలిపారు. ప్రొఫెసర్ బాల ప్రసాద్ సూచనల మేరకు రానున్న కాలంలో గుంటూరు నగరాన్ని కాలుష్య రహిత వాతావరణ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో కలిసి కృషి చేస్తామని తెలిపారు.
సమావేశంలో జిఎంసి ఇంచార్జి ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ప్రొఫెసర్ బాలప్రసాద్(ఆంధ్రా యూనివర్సిటీ), డిఎఫ్ఓ హిమశైలజ, జిల్లా పరిశ్రమల శాఖ డిడి మధుసూధన్ రెడ్డి, ఇంచార్జి డిఎస్ఓ కె.శ్రీనివాస్, ఆర్టీఓ కే.శ్రీహరి, ఏఓ సునీల్ కుమార్,ఏపిపిసిబి అనలిస్ట్ వెంకటేశ్వరరావు, కన్సల్టెంట్ కోమలి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *