Breaking News

జిల్లాలో అవసరానికి తగిన యూరియా సరఫరా జరుగుతోంది

-రైతులు అవగాహనతో, శాస్త్రవేత్తల సూచనల మేరకే ఎరువులు వినియోగించాలి
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
-జిల్లాలో అవసరానికి తగిన విధంగా యూరియా సరఫరా రైతులు అవగాహనతో వినియోగించాలి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు భయాందోళనలకు గురి కాకుండా, సమయానికి సరఫరా అవుతున్న ఎరువులను సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేసారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్– 2025 సీజన్‌కు అవసరమైన ఎరువుల సరఫరా సమయాను కూలంగా సరఫరా జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. 2025 ఏప్రిల్ నుండి సెప్టెంబర్‌ వరకు జిల్లాకు అవసరమైన 26,000 మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటివరకు 22,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్టు వివరించారు. గత సంవత్సరం ఖరీఫ్–2024లో రైతులు 13,300 మెట్రిక్ టన్నులు వినియోగించగా, ఈ సీజన్‌లో ఇప్పటికే 19,000 మెట్రిక్ టన్నులు అమ్మకమయ్యాయని, ఇంకా 2,300 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. పత్రికలలో వివిధ మాధ్యమాలలో యూరియా కొరత ఉందని వచ్చిన వార్తలకు విరుద్ధంగా రాజమహేంద్రవరం, గోకవరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో ఈసారి గత సంవత్సరం కంటే 20% నుంచి 99 శాతం వరకు ఎక్కువ యూరియా వినియోగం జరిగిందన్నారు. రైతులకు సూచిస్తూ .. యూరియా అధికంగా వాడకుండా, వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్తల సూచనలు మేరకే ఎరువులను వినియోగించాలన్నారు. రైతులు ఎరువులను సరైన మోతాదులో వాడితేనే నెలలో ఉత్పాదకత స్థాయి పెరిగి పంటలు ఆరోగ్యకరంగా పెరుగుతాయని తెలిపారు. ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలన్నారు. ఎవరైనా అధిక ధరకు అమ్మినా లేదా ఇతర ప్రాంతాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు

ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు మాట్లాడుతూ, యూరియా అవసరానికి మించి వాడడం వలన సాగు చేసే భూమి లో పోషక సమతుల్యత దెబ్బతింటుందన్నారు. తద్వారా పంటలకు తెగుళ్లు, పురుగుల దాడులు వచ్చే అవకాశముందని తెలిపారు. రాబోయే రబీ సీజన్‌కి కావలసిన ఎరువులు కూడా సరైన సమయానికి అందుబాటులో ఉంటాయనీ తెలియ చేశారు. ఎరువులు ఎక్కువ కాలం నిల్వ ఉంచితే గడ్డకట్టే ప్రమాదం ఉంటుందని, కాబట్టి అవసరమైన సమయంలోనే మాత్రమే ఆయా భూసార పరీక్షలు అనుసరించి వినియోగం చేయడం కోసం నిర్దిష్ట పరిణామంలో మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *