Breaking News

అన్నా క్యాంటీన్ల పరిసరాల్లో మొక్కలను పెంచాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అన్నా క్యాంటీన్ల పరిసరాల్లో మొక్కలను పెంచాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం పల్నాడు బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్ల పరిసరాల్లో పచ్చని మొక్కలతో కూడిన ఆహ్లాద కరమైన వాతావరణం కల్పించేందుకు మొక్కలను నాటాలని, అవసరమైన మొక్కలను జిఎంసి అందిస్తుందని అక్షయ పాత్ర సిబ్బందికి తెలిపారు. అలాగే క్యాంటీన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆహార సరఫరా అనంతరం శుభ్రం చేయాలన్నారు. నీరు లేదా విధ్యుత్ లైట్లు ఏమైనా సమస్య ఉంటే సంబందిత నోడల్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *