Breaking News

దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి…

-విభేదాలు లేకుండా అందరికీ న్యాయం చేస్తాము
-ఎమ్మెల్యే గోరంట్ల… ఆర్డిఓ నాయక్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దీర్ఘకాలంలో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలని, విభేదాలు లేకుండా అందరికీ న్యాయం చేస్తామని, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బుధవారం పిడింగొయ్యి గ్రామంలో సర్వే నెంబర్ 511 ప్రభుత్వ భూమిలో గల శివాలయం, అంబేద్కర్ వారి విగ్రహం కలిగిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆర్డీవో ఆర్.కృష్ణ నాయక్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గత ప్రభుత్వం లో భూ దోపిడీదారులు, కబ్జాదారులు రాజ్యం ఏలేరని, నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి, రూరల్ నియోజకవర్గంలో ముఖ్యంగా రూరల్ మండలంలో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేశారన్నారు. త్వరలో వాటన్నిoటిని రీసర్వే చేసి భూములను ప్రభుత్వం స్వాధీన పరుచుకుని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు పిడింగొయ్యి గ్రామంలో గల శివాలయం, అంబేద్కర్ వారి విగ్రహం కలిగిన ప్రాంతంలో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమి కలిగి ఉన్నదని, ఇరువర్గాలు కోర్టును ఆశ్రయించడంతో సమస్య దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నదని, ఇరు వర్గాలకు ఆమోద దాయకంగా ఉండే విధంగా కొంత స్థలాన్ని శివాలయం గుడి నిర్మాణం చేసుకునేందుకు కేటాయించి, మరి కొంత స్థలాన్ని అంబేద్కర్ వారి విగ్రహం మరియు వారి పేరుతో కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు కేటాయించి, మిగిలిన భూమిని పంచాయితీ పరిధిలో ఇళ్ళు లేని కొంతమంది బడుగు, బలహీన వర్గాల వారికి ఇళ్ళు నిర్మించేందుకు కేటాయిస్తామన్నారు. సదరు విషయాన్ని ఇరువర్గాల వారు ఆలోచించి తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సీ చైర్మన్ మార్ని వాసుదేవ్, తహసీల్దార్ శ్రీనివాస్, మట్ట శ్రీను, ముప్పిడి రాంబాబు, చిచారి సుబ్బారావు, బత్తుల శివ, గడ్డం ప్రభుదాస్, రేలంగి సత్యనారాయణ, గడ్డం చిన్నారావు, రేలంగి సత్యం, దాసరి రాము, రాంబాబు, ముప్పిడి గణేష్,పంచ కట్ల వీర్రాజు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *