రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా టి. కనకరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతిను, డిపిఎం శ్రీదేవితో కలిసి మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ – మెప్మా ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుని సమయానికి పూర్తి చేయాలని సూచించారు. మహిళా మార్ట్, ఆన్‌లైన్ వేదికల ద్వారా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 1991లో ఏపీపీఎస్సీ ద్వారా మున్సిపల్ పరిపాలన విభాగంలో ఉద్యోగంలో చేరిన కనకరాజు, మేనేజర్, కమిషనర్ పదవుల్లో హైదరాబాద్, విజయవాడ, ఉయ్యూరు, మండపేట, శ్రీకాకుళం, సామర్లకోట మొదలైన చోట్ల సేవలందించారు. ప్రస్తుతం సామర్లకోట పురపాలక సంఘం మేనేజర్‌గా పనిచేస్తూ డిప్యూటేషన్‌పై తూర్పు గోదావరి మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. తదుపరి స్థానికంగా ఉన్న పలువురు ప్రజా ప్రతినిధులను మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందనీ కనకరాజు తెలిపారు.
Prajavartha Online Telugu News